Thursday, January 24, 2013

నా ఇష్టాలు!!




తొలి పొద్దు సూర్య కాంతిలో పక్షుల కువకువ రాగాలు వింటూ కాఫీ తాగడమంటే.. ఇష్టం

ఇలయరాజా పాటల్లో హిరోఇన్లా ఊహించుకుని మైమరిచిపోవడమంటే..ఇష్టం

ఉన్న మొహనికి రంగులు పులుముకుని నన్ను నేనే డ్రీం గర్ల్ లా అద్దంలో చూసుకోవడమంటే..ఇష్టం

టివి లో రోజూ వచ్చే సిరియల్ని తిట్టుకుంటూనే మళ్ళీ రేపు ఏమవుతుందో అని ఊహించుకోవడమంటే..ఇష్టం

చేసిన వర్క్ చిన్నదైనా నేనే తోపు అని అందరి ముందు చూపించుకోవడమంటే.. ఇష్టం

ఏ కారణాలు లేకపోయిన ఫ్రెండ్స్ కి కాల్స్ చేసి అది ఇది అని చిట్ చాట్ చేయడమంటే.. ఇష్టం

చూసిన సినిమానే మళ్ళి మళ్ళి చూసి అదే సీనులకి ఏడ్చి నవ్వి హాయిగా టైంపాసు చేయడమంటే..ఇష్టం

ఎవరైనా పలకరిస్తే చాలు వాళ్ళని మాటలతో కట్టిపడేయడమంటే..ఇష్టం

పండు వెన్నెల్లో కొబ్బరాకుల చాటున దోబూచులాడుతున్న చందమామతో కబుర్లాడటమంటే..ఇష్టం

చలి గాలి ముంగురులను తడుముతుంటే చిలిపి ఊహల కలలు కనటమంటే..ఇష్టం

ఇలా నాకు నచ్చిన ఇష్టాలన్ని చెపుతూ మీ టైముని వేస్టు చేయడమంటే ఇంకా ఇంకా చాలా ఇష్టం ;)