Monday, July 31, 2006
Wednesday, July 19, 2006
పరిచయం..

ప్రతి క్షణం ఎదురుచూపు
ఎందుకో ఈ ఉలుకుపాటు
వస్తూందో రాదో తెలియని ఆ పలకరింపు
వస్తే ఇస్తూంది మైమరపు
రాకుంటే ఉండదు కంటికి కునుకు
వద్దనుకున్నా అవుతాయి ఈ తెలియని పరిచయాలు
ఎడారి వంటి మనసుకి అవుతాయి ఒయాసిస్సు
వీడి వెళ్ళిననాడు మాత్రం ఇస్తాయి భారమైన కన్నీలు !
Posted by
అభిసారిక
at
2:00 AM
3
comments
Monday, July 17, 2006
అభిసారిక..

ప్రతి రోజు కళ్ళళ్ళో మరో శుభోదయ కాంతులు చుస్తూ
నిన్నగా మారుతున్న జ్ణాపకాలను గుండెల్లో దాస్తూ
భాధలని సంతోషాన్ని ముడివేసిన కన్నీలతో కళ్ళని కడుగుతూ
సాగుతుంది నా పయనం నేడులో.. రూపంటూ లేని రేపు వైపుకి
గమ్యమెరుగని కాలంలో నా జీవిత యానం సాగుతుందిలా
నేటి ఆనందాలను తాకట్టు పెట్టి మాత్రం కాదు
ప్రతి క్షణం అనుభవిస్తూ.. ఆశ్వాదిస్తూ.. మీలాంటి నేస్తాలతో పంచుకుంటూ...
Posted by
అభిసారిక
at
11:00 PM
2
comments
Monday, July 10, 2006
Wednesday, July 05, 2006
కోరిక..

ప్రతి రోజు సూర్యుడు నవ్వుతూ నీకు శుభోదయం చెప్పాలని
ప్రతి రేయి చందమామ చల్లని కబుర్లతో కలల లోకంలో నిన్ను తిప్పాలని
ప్రతి తారక నీ ఎదుగుబాటలో ఒక మెట్టుగా నిలవాలని
ప్రతి పదం నీ కవితా వెల్లువలో ఓ మణిపూసగా జతవడి మిగిలిపోవాలని
నా ప్రతి సంతోషంలో నీ సంతోషం దాగి ఉండాలని
నా ప్రతి చిరునవ్వుకి అందం నువ్వే కావాలని
నా జీవిత పయనంలో ఏనాడు విడిపోని నేస్తంలా
ఒక మనసున్న బాటసారిలా నాతో కలిసి పయనించాలని నా ఆశ.. నా కోరిక !
మరుపురాని మరువలేని.. మదుర ఘట్టం కావాలి మన స్నేహం
మనిద్దరి జతలో గడిచిన ప్రతిక్షణం ఓ ప్రబంధం అవ్వాలి అని కోరికతో
సారిక !
Posted by
అభిసారిక
at
8:00 AM
2
comments



