Thursday, August 10, 2006

చిత్రం..


మెత్తగా హృదిని తట్టి..మెల్లగా వెల్తున్న ఆ చల్ల గాలికి.. మనసే స్పందించి ఒక చక్కని చిత్రం చిత్రించింది.. అందులో రంగులు నింపాలని వెతుకుతుంటే.. ఇంద్రదనస్సులాంటి నీ నవ్వుల కాంతులు కనిపించేయి.. మైమరిచి ఆ చిత్రం పూర్తి చేస్తే.. ఆశ్చర్యమెమో తెలీదు కాని కాలమే ఒక క్షణం ఆగి తిరిగి చూసి ఒక కొంటె నవ్వు నవ్వి మళ్ళి మరలి సాగిపోయింది.. ఆ చిత్రం ఎవరిదో కాదు.. నీదే !!

Tuesday, August 08, 2006

రేయి..


అందమైన వెన్నెల..చల్లని సాయంత్రం వేల..పచ్చని గడ్డి ఊయలూగుతున్న సమయాన..మల్లెల సుగందాల పరిమళాల మద్య..వెండి వెన్నెల కాంతుల్లో..మనసు పరవళ్ళలోన..ఆ చందమామ సాక్షిగా..నీ రాకకై వీక్షిస్తూన్న నా కనులని చూసి వెన్నెల సహితం అబ్బురపడి..ని చెంతకు చేరి చెప్పిన నా వలపు సంకేతాలని విని..నీవు రాగా నీ అడుగుల సవ్వడికే నా హృదయ సవ్వడి జోడై నా ఊపిరి కుడా బారమైన ఆ నిమిషంలో..ఒకే ఒక్క క్షణం నా మనసుకి అనిపించింది ..
ఈ రేయి ఇలాగే ఉండిపొనీ .......