Thursday, December 29, 2005

Happy New Year


నీలి గగనాల మాటున దాగిన నా ఆశలు
పిల్ల గాలుల అలల సవ్వడులపై తేలి
సుమదుర మదురిమలుగా కురిసే........

రాబోవు నూతన సంవస్త్సరమునకు
సరికొత్త ఆశలతో స్వాగత కుసుమాంజలి !!

Wish U All A Very Happy New Year 2006.
I wish all of ur dreams come true.

నీలో..


ఉచ్వాశమౌ తా నీ శ్వాశలో
జీవమౌతా నీ ప్రాణం లో
స్పందన ను అవుతా నీ హౄదయం లో
చెలిమి నే అవుతా నీ స్నేహం లో
కల్పన ని అవుతా నీ ఊహల్లో
భావాన్ని అవుతా నీ బాసల్లో
ఆలొచన ని అవుతా నీ ఏకాంతం లో
ఆలాపన ని అవుతా నీ మౌన గీతం లో
ఆతౄతని అవుతా నాకొసం వేచి వుండే నీ ఎదురు చూపుల్లో
మోగలి కాంక్షని అవుతా నీ ఏకాంత సిబిరం లో..
వీడిపోని బంధమౌతా నీ నులి వెచ్చని కౌగిల్లో
ఊపిరి ని అవుతా నీ హౄదయం లో !!

Tuesday, December 27, 2005

ఓ స్నేహమా..



మంచి అనే ఉద్యానవనంలో వికసించిన కుసుమానివో
మది అనే నదిలో ప్రవహించే అమౄతానివో
మమత అనే అద్భుత అనుబంధానికి అంకురానివో
మనసు పాడే సుమధుర గీతానికి పల్లవివో...

మనసు అనే వేదికపై వయసు వేసే నౄత్యానివో
వయసు వేసే నౄత్యానికే ఓ చక్కటి అభినయానివో
జ్ఞాపకమను వేదికపై చెలరేగిన అలల తాకిడివో
వెల్లువై తీరాన్నిచేరి అలసిపోయిన కడలి కెరటానివో...

ఊహ అనే మహాసముద్రమో ఎగసిపడుతున్న అల నీవో
స్వప్నమను నందన వనంలో నేను కట్టుకున్న సౌధానివో
మమకార మను పూతోటలో సుగంధాలు వెదజల్లే పారిజాతానివో
అలంకారం అను హారంలో పొందికగా ఒదిగిపొయిన మణిపూసవో...

చెలిమి అనీ పేరుతో నీవు కోరే చేయూతకు
నేను ఎల్లపుడూ సిద్ధం
మైత్రి అనే మరోపేరుతోనైనా దరికిచేరితే
కలిసి పయనిద్ధాం
నిర్వచనం లేని ప్రేమకి కుడా ఓ అందమైన
అర్ధాన్నందించిన ఓ స్నేహమా
అంతేలేని నీ స్వరాజ్యంలో నాకు కూడా
కాసింత చోటు కల్పించవూ....

Sunday, December 25, 2005

ఓ కొయిలమ్మా


కోయిలా.......కూయవే........తీయగా
సవ్వడి.........చేయవే........... హాయిగా
మనసులోన తొడిగే ఆశల మామిడి చిగురులు
ముంగిట్లోన విరిసే ముద్దొచ్చే మందారాలు
మదిలోన కురిసే, సేద తీర్చే వేసవి మల్లెలు
మందుటెండలోన పలకరించే చిరుగాలులు
ఈ ప్రక్రుతి అంతా నీ సుస్వరాలతో శోబిల్లే
సొభానాలేనమ్మ.....ఓ కోయిలమ్మ
నలుపు నీ రంగయితే.....కమ్మని కావ్యమైన నీ రాగం
స్వచ్చమైన తెలుపమ్మా....ఓ కొయిలమ్మా !!

Friday, December 23, 2005

బంధం


బంధమో అనుభందమో
తెలియని మనసుకు
తెలుసు ఒక భావం
ప్రేమ అనే పదంలో
ముడేసే మనసుకే
తెలుసు దాని అర్దం
వ్రాయవచ్చు ఒక కావ్యం
తెలియదు దాని అంతం
మనసుకి తెలుసు దాని భాష్యం
కాని తెలుపదు దాని పరమార్దం
ముగించలేదు ఆ కావ్యం
చెప్పలేదు దాని భావం
చెరుపలేదు అనురాగం
మరువలేదు భందం
ముగిస్తుంది జీవితం
అందుకే అది అయ్యింది అమరం
ప్రతిమనసుకి తెలుసు
ప్రేమ చిరస్మరనీయం
అది తెల్సుకొని బ్రతకడమే
జీవిత పరమార్ధం !!

Thursday, December 22, 2005

ఆశ


మాట రాక తడబడే నీ ముందర ఆ క్షణాలు
నిజంగా నీ మాటలు అక్షర లక్షలు
నీ ముందుకు రాలేని, చెప్పలేని బిడియాలు
నీ కంటి పాపలో నా రూపు చూడలేక సిగ్గులు
నిను వీడలేక వెల్లలేని ఆ తీయని బాధలు
నీ ముందర నిలుచుంటే ఆగలేని గుండె జల్లులు
సిగ్గువిడిచి చెబుతున్నా నాలోని భావాలు
నీ హ్రుదయాన దాగుండాలని ఏవో ఆశలు !

కవిత్వం


స్వప్నం లోంచి పుట్టిన కవిత్వం
మనసులను వూహింప చేస్తుంది !
జీవితం నేర్పిన కవిత్వం
అలసిన మనసులను వూరడిస్తుంది !

వీడ్కోలు


ప్రతి క్షణం ఎదురుచూపు
ఎందుకో ఈ ఉలుకుపాటు
వస్తుందో రాదో తెలియని ఆ పలకరింపు
వస్తే ఇస్తుంది మైమరపు
రాకుంటే ఉండదు కంటికి కునుకు
వద్దనుకున్న అవుతాయి ఈ నిలవని పరిచయాలు
ఎడారి వంటి మనసుకి అవుతాయి ఒయాసిస్సు
వీడి వెల్లిననాడు మాత్రం ఇస్తాయి బారమైన కన్నీలు !

ప్రేమ - 2


శ్రుష్టికి తొలి నేస్తం
విశ్వగ్రందానికి ఆది అంతం
మనోగవాక్షానికి తొలి సంతకం
ఎవ్వన వసంతాన నవ చిగురుల
తొలి అందం ప్రేమ !

ప్రేమ - 1


ఎద సముద్రపు అలలపై
నిశ్చలంగా రూపుదిద్దుకున్న
అపురుపస్వరూపమై విచ్చుకున్న
విచిత్ర చిత్రమే ప్రేమ !

నేస్తం


నాపై వ్రాసే ప్రతి పదంలో
నాకై అర్పిస్తున్న మాటల మాలికలో
నీ కవితల వెల్లువలో
నన్ను నేను మర్చిపొగలను - నేస్తం
కాని నాకై తపిస్తున్న నిన్ను మరువ తరమా
గడ్డిపోచని తెలిసి కుడా నన్ను చేరిన ఓ మంచి ముత్యమా
రవి కిరణం సోకకుండ నిన్ను దాచుకొవడం నా తరమా
కరిగి నానుండి జారిపొకుండా ఆపవసమా
నీవే చెప్పమ్మ రాగాల ఓ కొయిలమ్మ !

కాలం


కదులుతుంది కాలం సాగర కెరటంలా
ఏదో సాధించాలన్న ఆరాటం
సాధించవచ్చులే అన్న నిర్లక్ష్యం
కదులుతోంది కాలం
ఏదో చేద్దామనే కుతూహలం
కాని ఏమిచేయలేని పిరికితనం
కాలం ఇలా కదిలిపొతూనే..
కదిలిపొయింది కాలం
చెరిగిపోయాయి స్మ్రుతులు
గడిచిన సమయం వౄధా అని విచారం
తలుచుకుంటె ఆపలేని దుఖం !