Thursday, January 05, 2006

తృప్తి


కోరికల కొండల ఆవల
నింగి నేల కలిసే అంచున
అందంగా నిలబడి ఉన్న తృప్తిని చూసి
అందుకుందామని వెర్రి అశలతో పరుగెడితే
ఎన్ని కొండలు దాటినా
తృప్తికి, నాకూ మధ్య దూరం తరగడం లేదు
అలిసి, విసిగి వెనుదిరిగిన నేను
ఒక్కమారు నాలోకి తొంగి చూసాను చిత్రం !
అది నాలోనే నిండుగా ఉంది !!

7 comments:

kiraN said...

WOW! అద్బుతంగా రాసారు, చాలా బాగుంది.

Applause.. keep going :)

అభిసారిక said...

Thx kiron.

Anonymous said...

vow...very expressive poem.

అభిసారిక said...

Thx.

Yoga said...

ee kavita chaala baavuMdi..
telisina nijaannE, maMchi upamaanaM tO cheppaaru...
good job:)

అభిసారిక said...

Thx yoga :)

spandana said...

ఇన్ని రోజులు... కన్నులుండీ, ఇంటెర్నెట్ ఉండీ, మనసు ఉండీ ఇన్ని ఆణిముత్యాల్ని చదవలేక పోయానే! ఇప్పటికైనా చదువుతున్నాను.. ఇంకి పోయిన నా హృదయజలాశయంలో మళ్ళీ కొద్దిగా చెమ్మ!
తత్వం, కవిత పూర్తిగా మమేకమయిపోయాయి మీ కవితలో.
తృప్తిని హృదయంలోనే దాచుకొని ఎక్కడొ ఉందని పరుగెత్తడం.. మీ కవితలోనే చూడాలి!
-- ప్రసాద్