నీ రాకకై ...

గడ్డిపూల గుంపుల అంచున మెరిసేటి
ఓ మంచి ముత్యమా జారిపోకుమా...!
అలసి సొలసి నా సఖుడొస్తే
పాదాలు కడుగను నీవు కావాలి సుమా...!!
గుడ్డిదీపపు చిన్న వెలుగున
కనిపించు ఓ కాంతి కిరణమా ఆరిపోకుమా...!
యే నిశి రాత్రో నా ప్రియుడొస్తే
దారి చూపను నీవుండాలమ్మా..!!
మసక బారిన నా కన్నుల
నిలిచిన ఓ జీవమా నన్నిడిచిపోకుమా...!
నా కై నా ప్రాణనాధుడొస్తే
అతని పాదాల చెంత విడువడానికై కాస్సేపు ఆగమ్మా...!


3 comments:
very good way to express the feelings towards yours loved one.
Usha
Thx Usha.
ఈ కవితకి..కామెంటు.. రాయలేను..నేను.. ఎంత రాసినా..తక్కువే..
Post a Comment