Monday, January 16, 2006

యత్నం..


అనుకున్నది సాధించాలని ఆశిస్తే సరిపోతుందా ?
అడుగైనా కదపకపోతే ఆకాశం అందేస్తుందా ??

ఉలి దెబ్బలు తొలచకపోతే శిల చక్కని బొమ్మౌతుందా ?
పలుగు నేల తగలకపోతే పంట వెలుగు మనదౌతుందా ??

వేలి కొసలు మీటకపోతే వీణపాట వినిపిస్తుందా ?
వేల శృతులు కలవకపోతే బృందావనమనిపిస్తుందా ??

యోచనకే పరిమితమైతే ఆశించిన గమ్యం దొరకదు !
ఆచరణే కరువై పోతే ఆశయాలకర్ధం మిగలదు !!

12 comments:

kiraN said...

chaal baagundi.. keep writing.

అభిసారిక said...

Thx Kiron :)

Héctor Ojeda said...

Hello big friend, who is your language? very good luky in your life with around people.

A Hug from Chile, South America.

anveshi said...

"యోచనకే పరిమితమైతే ఆశించిన గమ్యం దొరకదు !
ఆచరణే కరువై పోతే ఆశయాలకర్ధం మిగలదు !!"
Good inspiring lines Saarika ! :)

అభిసారిక said...

Thx Anveshi :)

Yoga said...

This is really good...very lyrical too...
Njoyed reading it...
idi mana group lo post cheyyochchu gaa....
andariki telustundi kooDaa..

అభిసారిక said...

Thx Yoga.. next time i will post them in the group too.

Anonymous said...

Saarika gaaru...
this is wonderful....
chala chala baagundi
very inspiring!

అభిసారిక said...

Thx Chaitanya :)

చేతన_Chetana said...

చాలా బాగుంది సారికా..!!

అభిసారిక said...

Thx Chetana :)

spandana said...

‌మీ పేరు సారిక భలే అయిపోయిందే! ఆభిసారిక మీ కలం పేరు కదూ! ఈ ఇంటర్నెట్ మాయాజాలం ఎక్కడో ఉన్నవారిని, రూపం చూడకా, మాట వినకా మనసును మాత్రం చూడనిస్తుంది. ఈ యుగంలో జీవించడం ఎంత అదృష్టం!
-- ప్రసాద్