Thursday, February 02, 2006

వనమాలి..


గాలికి రాలిన ఆకుల్ని సహితం
ప్రేమగా సృచించే ఓ తోటమాలి
వాడిన పూలపై నీకెందుకోయి జాలి..

మొగ్గగానే మొక్కనుండి దూరమై
వెలుగుచూడని ఈ వికసించని పూలపై
నీ కెందుకోయి జాలి ..

పూలు కోసేవారికి లేని జాలి
చెట్లు నరికే వారికి లేని జాలి
మాపై నీ కెందుకోయి వనమాలి !!

3 comments:

Srinivas Vadrevu said...

మొగ్గగానే మొక్కనుండి దూరమైనా, నలుగురికీ సువాసనలందిస్తూ, అందరి జీవితాలలో వెలుగులు పంచుతూ, వారి కన్నులలో వేకువ మెరుపులు నింపుతున్న, నీపైనెందుకోయి జాలి?

అభిసారిక said...

:)

spandana said...

ఆహా! ఎంత చక్కని సమాధానము. ":)" . మీ మాటలు కవితలుగా తప్ప మాటలుగా రావా? కానీ నాకినిపిస్తోంది మీ నిశ్శబ్దం చేసే సవ్వడి. :)

-- ప్రసాద్