ఊహ
ఏదో ఊహ పేపర్ లో పెట్టే అంత వరకు ఆగనంది
తీరా పెన్ చేత పట్టేక ముందుకు సాగనంది
భాష వెతికి అక్షరాల్లో ఉంచుతుంటే చేయి వణికింది
కొంచెం ఆగి తిరిగి వ్రాస్తుంటే ఆశ పుట్టింది
ఆ ఆశ నిజమైతే ఎంతో బావుందనిపించింది
ఇలా ప్రతి ఊహ ఆశతో జతకమ్మంటే జీవితం నవ్వింది
కాని మనిషన్నాక ఆశ పడటంలో తప్పు లేదనిపించింది
అందుకే ఆశ నిజమవ్వడానికి ప్రయత్నం మొదలైయింది
ప్రయత్నం చేసి ఎదురు చూసి, చేరినట్టే అనిపించింది
కాని చివరకి అపజయం దక్కింది
అంతటితో ఆగేనా.. ఊహలు ఊహించటం మానేనా
ఆశ పడటం ఆపేనా.. అందుకే అంటారేమో
ఆశ పడు కాని ఆశించద్దు
ఊహించు కాని నిజమవ్వని శాశించద్దు
ఉన్నదాంట్లో త్రుప్తి పడు
లేనిది నాది కాదని సరిపడు
అప్పుడు అవుతుంది నీ జీవితం ఆనందమయం
లేదా అందులోనే దాగి ఉంది నీ పతనం !


13 comments:
బహుకాల దర్శనం అభిసారిక గారూ!!
- బుడుగు
Ya meeru ela unaru? Thanks for still remembering me:)
చాలాబాగా రాసారండి ..ఇదే మొదటి సారి మీ బ్లాగును చూడటం :) బొమ్మ మీరే వేసారా చాలా బాగుంది
నాకు అంత టాలెంట్ లేదండి:)
Thanks for stopping by.
చాలా బాగా రాసారు అభిసారిక గారు. ఔను అభిసారిక, బుడుగు అంటే మన బండ లో అభిసారికేనా ?
- crazydiode
Thanks Shashank.
అవునండి.
చాలా బావుందండి.మళ్ళా ఫాం లోకి వచ్చారన్న మాట.ఇక మాకు పండుగే.
సూపర్ గా ఉంది... చాలా కాలమైంది మీ బ్లాగు చూసి !
Thanks Radhika, Chaitanya:)
ee line chala bagundandi...
ఆశ పడు కాని ఆశించద్దు...
Thanks andi.
మొత్తానికి మీ ఊహలకు రూపమిచ్చారు.
కవితగా రాశేశారు... బాగుంది. :)
Thanks andi :)
Post a Comment