Wednesday, October 07, 2009

విచిత్రం



నేటి ప్రపంచం

చూపించమంటూంది సామర్ధ్యం

అడుగు ముందుకు వేస్తే ఆటంకం

వెనక్కి తీసుకోలేని అంతర్మదనం

ఎంతో దూరం లేదు అనుకున్న గమ్యం

సమయం రాగానే అంతా శూన్యం

ఎటు వెల్లాలో తెలియని గత్యంత్రం

మనసుకి అంతుపట్టని ఈ విపరీతం

ముందు కనిపించిన రంగుల చిత్రం

నేడు రంగులు మాయమై కనిపించేను తెల్ల కాగితం

ఎమిటో ఈ విచిత్రం !!

6 comments:

cartheek said...

adenanDi prapanchamante

anukunnadi eppudu anukoolamgaa jaragadu....

cartheek said...

malli meereppudu koththa tapa rasthunnaru.....

iwwh said...

good pic-iwwh.blogspot.com

సవ్వడి said...

నిజం చెప్పారు. సరిగ్గా చెప్పారు.

Unknown said...

మనిషి ఆవేదన చాలా బాగా ప్రస్తావించారు. స్పందింపజేసినందుకు ధన్యవాదాలు.

స్పందన:

అడుగడుగునా ఆటంకం
ఎదుర్కొంటే మిగులు అనుభవం
అవును రేపటి సామర్థ్యం

ఎంతకీ చిక్కదు గమ్యం
లేదు మరి గత్యంతరం
అంతర్మధనంలో ఉంది మర్మం

వెనక్కి తీసుకుంటే ఇక మిగిలేది శూన్యం
అటో ఇటో ఎటో వైపు,
మరో ముందడుగుతోనే ఎదైనా సాధ్యం!

కాదిది రంగుల చిత్రం
తెల్ల కాగితం పై
ప్రపంచపు మాయా
జీవన చదరంగం!

ఏమిటో మరి ఈ విచిత్రం
ఈ వైపరీత్యపు విషపుకోరలకందని
సగటు మనిషి జీవన ఛత్రం!

బహుశా! ఇది కేవలం
చేరినా చేరకపోయినా, గమ్యానికి
దగ్గరవుతానన్న నమ్మకం!

:-)

anveshi said...

knock knock...