ఓ స్నేహమా..
మంచి అనే ఉద్యానవనంలో వికసించిన కుసుమానివో
మది అనే నదిలో ప్రవహించే అమౄతానివో
మమత అనే అద్భుత అనుబంధానికి అంకురానివో
మనసు పాడే సుమధుర గీతానికి పల్లవివో...
మనసు అనే వేదికపై వయసు వేసే నౄత్యానివో
వయసు వేసే నౄత్యానికే ఓ చక్కటి అభినయానివో
జ్ఞాపకమను వేదికపై చెలరేగిన అలల తాకిడివో
వెల్లువై తీరాన్నిచేరి అలసిపోయిన కడలి కెరటానివో...
ఊహ అనే మహాసముద్రమో ఎగసిపడుతున్న అల నీవో
స్వప్నమను నందన వనంలో నేను కట్టుకున్న సౌధానివో
మమకార మను పూతోటలో సుగంధాలు వెదజల్లే పారిజాతానివో
అలంకారం అను హారంలో పొందికగా ఒదిగిపొయిన మణిపూసవో...
చెలిమి అనీ పేరుతో నీవు కోరే చేయూతకు
నేను ఎల్లపుడూ సిద్ధం
మైత్రి అనే మరోపేరుతోనైనా దరికిచేరితే
కలిసి పయనిద్ధాం
నిర్వచనం లేని ప్రేమకి కుడా ఓ అందమైన
అర్ధాన్నందించిన ఓ స్నేహమా
అంతేలేని నీ స్వరాజ్యంలో నాకు కూడా
కాసింత చోటు కల్పించవూ....



6 comments:
Abhisaarikaa,
kavita baavundi kaanI, renDo verse sandarBaaniki saripOlEdEmO anipistOMdi...
adi snEham kannaa, prema(srungaara) baavam vyaktaparustunnaTTu undi...
migitaavanni baaga sripoyaayi...
muKyaMgaa aakhari verse chaala baavundi...
Yoga
PS: You can join a poetry yahoo group if you want to:
www.groups.yahoo.com/group/kavita-o-kavita
We need active people like you
oh thanks yoga :) its good to see the people who encourage and give suggessions. I will try to join in tht group. Thx again.
Thanks for joining the group.
BTW, aa group start chesindi nEnE:).
kavitha-O-kavitha !lOki swagatam!suswagatam!saarika.
regarding the poem i agree with yoga.aakhari verse baagundi kaani,
paina cheppina poem ki conclusion
ga anipinchaledu.endukO...!
meeru chepeka malli nenu chadivitee naku kuda alage anipinchindi anveshi.. :(
Thanks.
అభిసారిక గారు! ఒకే ఒక రోజులో మీ అభిమానిని (సారీ! మీ కవితాభిమానిని) అయిపోయాను. yoga, anveshi అన్నదె నిజమే అవచ్చు కానీ వెనుదిరిగి చూడకండి. మళ్ళీ మళ్ళీ చూసి సరి చేసి వ్రాసింది సహజంగా మనసు మాటునుండీ తొంగిచూసిందిలా ఉండదు. పని గట్టుకుని వ్రాసిందిలా ఉంటుంది. నాకెందుకో మీకవితల్ని చూస్తే మీ చేయి కాకుండా మీ మనసే వ్రాస్తున్నదిలా అనిపిస్తుంది. ఆ కోమలత్వాన్ని, మొగ్గదనాన్ని, కవిత పసిదనాన్ని అలాగే ఉండనివ్వండి.
-- ప్రసాద్
Post a Comment