Thursday, December 22, 2005

ఆశ


మాట రాక తడబడే నీ ముందర ఆ క్షణాలు
నిజంగా నీ మాటలు అక్షర లక్షలు
నీ ముందుకు రాలేని, చెప్పలేని బిడియాలు
నీ కంటి పాపలో నా రూపు చూడలేక సిగ్గులు
నిను వీడలేక వెల్లలేని ఆ తీయని బాధలు
నీ ముందర నిలుచుంటే ఆగలేని గుండె జల్లులు
సిగ్గువిడిచి చెబుతున్నా నాలోని భావాలు
నీ హ్రుదయాన దాగుండాలని ఏవో ఆశలు !

1 comment:

spandana said...

ఈ బొమ్మ గీశాక ఈ కవిత రాశారా?
ఈ కవిత రాశాక ఈ బొమ్మ గీచారా?
-- ప్రసాద్